Tuesday, December 24, 2024

101 ఏళ్ల వయసులో జపాన్ యువరాణి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

జపాన్ రాజకుటుంబానికి చెందిన అత్యంత పెద్ద వయస్కురాలు, జపాన్ యువరాణి యురికో కన్ను మూశారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. టోక్యో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రిన్సెస్ యురికో తుదిశ్వాస విడిచారని రాజకుటుంబం ఒక ప్రకటనలో తెలియజేసింది. యురికో మరణానంతరం జపాన్ రాజకుటుంబంలో మరి 16 మంది మాత్రమే మిగిలారు. కాగా, యువరాణి అస్తమయం నేపథ్యంలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా సంతాపం తెలియజేశారు.

ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి అని ఇషిబా తన ప్రకటనలో పేర్కొన్నారు. జపాన్ ప్రజలు అందరితో పాటు తాను కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ఇషిబా వెల్లడించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఒక మోస్తరు పక్షవాతం కారణంగా యువరాణి యురికో గత మార్చిలో ఆసుపత్రిలో చేరారు. ఆమె మూత్రపిండాలు, గుండె పని తీరు కూడా క్షీణిస్తున్నట్లు వైద్య పరీక్షలో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News