Thursday, January 9, 2025

హోలీ పేరుతో నరకం చూపించారు… (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: హలీ వేడుకలు ఒక మహిళకు నరకాన్ని చూపించాయి. రంగుల పేరుతో ఒక మహిళ పట్ల కొందరు పురుషులు అసభ్యంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూయడమేగాక ఆమె తలపై కోడిగుడ్లు పగలగొట్టడం, వద్దంటున్నా శరీరాన్ని తాకడం వంటి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక మహిళపై అందునా జపాన్ జాతీయురాలని భావిస్తున్న ఒక విదేశీ మహిళపై ఈ రకమైన దాడికి కొందరు వ్యక్తులు పాల్పడడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

కాగా.. ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోలను పరిశీలించి యువతిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆమె ఆదేశించారు. హోలీ పండుగ నాడు విదేశీ వనితలపై లైలంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇది పూర్తిగా సిగ్గుపడాల్సిన ప్రవర్తన అంటూ ఆమె మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News