Monday, January 20, 2025

జపాన్ జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోతోంది

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ లో జనాభా తగ్గిపోతోంది. ఊహించని విధంగా జననాల రేటు పడిపోతోంది. జపాన్ జనాభా 123.9 మిలియన్లు. గత ఏడాది జననాలు 727277 మాత్రమే.  ఈ డేటాను ఆ దేశ ఆరోగ్య, ఉపాధి, సంక్షేమ శాఖ విడుదల చేసింది. జపాన్ ఫెర్టిలిటీ రేట్ 1.26 నుంచి ఇప్పుడు 1.20 కి పడిపోయింది.  జపాన్ జనాభా నిలకడగా ఉండాలంటే ఫెర్టిలిటీ రేట్ 2.1 గా ఉండాలి.

జపాన్ లో జనాభా మెల్లమెల్లగా తగ్గిపోతోంది. పనిచేసే వయస్సు జనాభా కూడా తగ్గిపోతోంది. అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గిపోతున్నాయి. గత ఏడాది తో పోల్చితే ఈ ఏడాది పెళ్ళిళ్లు 30 వేలు తగ్గిపోయాయి. జనాభా తగ్గిపోతున్న విషయాన్ని జపాన్ లోని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. గవర్నమెంట్ పెళ్లిలను ప్రోత్సహించేందుకు డేటింగ్ యాప్ ను కూడా తేబోతోంది. అది ఇప్పుడు పరీక్షలో ఉంది. యాప్ ద్వారా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, చైల్డ్ కేర్, హౌజింగ్ అసిస్టెన్స్, కెరీర్ కౌన్సలింగ్ వంటివి కూడా చేపడతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News