టోక్యో: నిన్నమొన్నటి వరకు ఎగిరే కార్ల గురించి చర్చ జరిగింది. ఇప్పుడు జపాన్‌లోని టోక్యోకు చెందిన స్టార్టప్ కంపెనీ ఎఎల్‌ఐ టెక్నాలజీస్ ఎగిరే బైక్(Hoverbike)ను ఆవిష్కరించింది. ఈ బైక్ బుకింగ్ కూడా ఆరంభమైంది. ఈ ఎగిరే బైక్ పేరును XTURISMO Limited Edision అని పెట్టారు. ఈ ఎగిరే బైక్ బుకింగ్‌ను అక్టోబర్ 26 నుంచే మొదలెట్టారు. కంపెనీ కేవలం 200 యూనిట్ల ఫ్లయింగ్ బైక్స్‌ను మాత్రమే తయారు చేయనుంది. ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైసుకె కటానో రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మనం ఇంత వరకు రవాణాకు నేల మీద మాత్రమే కదలాడాము. ఇప్పుడు మేమే కొత్త విధానాన్ని కనుగొన్నాము. నలుపు, ఎరుపు రంగులో ఉండే ఈ హోవర్‌బైక్ కనిపించడానికి మోటార్ సైకిల్ మాదిరే కనిపిస్తుంది. దీని మీద ప్రొఫెల్లర్స్ ఉంటాయి. స్థిరమైన మెషిన్ ఉండడం వల్ల ల్యాండింగ్ స్కిడ్స్ కూడా ఉంటుంటాయి. ఈ స్టార్టప్ కంపెనీకి మిత్సుబిషి ఎలెక్ట్రిక్, క్యోసెరా మద్దతునిస్తున్నాయి. ఈ ఎగిరే బైక్‌ను ఫుజి కొండల వద్ద ప్రదర్శించారు. ఇది నేలకు కొన్ని మీటర్ల ఎత్తులో ఎగిరింది. జనరద్దీ ఉండే ప్రాంతాల్లో ఎగిరేందుకు దీనికి అనుమతి ఉండదు, రెస్కూ టీమ్ సమస్యలను ఇది సునాయాసం చేసేస్తుంది. దుర్గమమైన ప్రదేశాలలోకి వెళ్లగలుగుతుంది.
జపాన్ ఎగిరే బైక్ బుకింగ్ ఆరంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -