- Advertisement -
టోక్యో: జపాన్ పార్లమెంటు సోమవారం నూతన ప్రధానిగా ఫుమియో కిషిడాను ఎన్నుకుంది. గత ప్రధాని యోషిహిడే సుగా క్యాబినెట్లో రెండు స్థానాలు తప్పించి 20 స్థానాలను పునర్ భర్తీచేయనున్నారు. విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటెగి, రక్షణ మంత్రి నోబువో కిషిని కొనసాగించనున్నారు. కేవలం ముగ్గురు మహిళలను మాత్రమే కొత్త క్యాబినెట్లో చేర్చుకున్నారు.
కిషిద, ఆయన మంత్రి మండలి సోమవారం ప్రమాణస్వీకారం చేయనుంది. తన ప్రాధాన్యత ఆర్థికవ్యవస్థపై ఉండగలదని కిషిడా గత వారమే తెలిపారు. ఆయన జనుల ఆదాయాన్ని మరింత పెంచాలన్న లక్షంతో ఉన్నారు. కిషిడా హిరోషిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 1993లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
- Advertisement -