Sunday, December 22, 2024

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ తెరకెక్కుతున్న క్రేజీ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ ప్రస్తుతం షూటీంగ్ జరుపుకుంటోంది. ఇప్పటివరకు ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ మూవీ అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎంగానో ఎదురుచూస్తున్నారు. చివరికి వారి ఎదురు చూపులకు తెర దించుతూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. మార్చి 27 అంటే రేపు ఈ మూవీ నుంచి జరగండి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలుపుతూ కొత్త పోస్టర్ వదిలారు.

ఇక, శంకర్ సినిమాల్లో సాంగ్స్ చాలా ప్రత్యేకత ఉంటాయి. దీంతో ఈ పాట ను ఎప్పుడెప్పుడు వినాలని మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. దీంతోపాటు మెగా ఫ్యాన్స్ మరో ట్రీట్ ఉంది. రేపు రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమా మళ్లీ థియేటర్ లో విడుదల కాబోతోంది. అలాగే, చరణ్ అప్ కమింగ్ సినిమాల అప్డేట్స్ కూడా రావొచ్చు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News