Wednesday, January 22, 2025

టైటిల్ పోరుకు ఇగా, జాస్మిన్

- Advertisement -
- Advertisement -

సెమీస్ గాఫ్, ఆండ్రీవా చిత్తు
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ :  యువ టెన్నిస్‌స్టార్ కొకో గాఫ్(యెఎస్‌ఎ)పై స్వియాటెక్ ఘన విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి తుది పోరుకు దూరుకెళ్లింది. వరుస సెట్లలో జోరు చూపించి 6-2, 6-4తో గాఫ్‌ను మట్టికరిపించింది. దీంతో వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుపెట్టిన తొలి మహిళా టెన్నిస్టార్‌గా ఈ 23 ఏళ్ల ఇగా స్వియాటెక్ రికార్డు నెలకొలిపింది.

అంతేకాదు, ఈ గెలుపుతో గాఫ్‌పై 11వ సారి పైచేయి సాధించింది. ఈ పోరులో ఓడిన గాఫ్‌కు రెండో ర్యాంక్ దక్కడం విశేషం. బెలారస్ ప్లేయర్ అరినా సబలెంక క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో గాఫ్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇక రెండో సెమీస్‌లో పావ్‌లిని, మిర్రా ఆండ్రీవా తలపడగా జాస్మిన్ అలవోకగా విజయం సాధించింది. కేవలం రెండు సెట్టలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో అండ్రీవా ఏ దశలోనూ పోరాడినట్టు కనిపించలేదు. దీంతో జాస్మిన్ వరుసగా 63, 61తో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా, ఫైనల్లో ఇగా స్వియాటెక్‌తో జాస్మిన్ పావ్‌లిని తలపడనుంది.

ముగిసిన బోపన్న జోడీ పోరు..

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి బోపన్న జోడీ వైదొలిగింది. రోహన్ బోప న్న జోడీ సెమీస్‌లోనే ఇంటి దారి పట్టింది. దీం తో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కొట్టాలన్న ఏడేళ్ల బోప న్న కల నెరవేరకుండా పోయింది. గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో రోహన్ బోపన్నమాథ్యూ ఎడ్‌బెన్‌ల జోడీ అనూహ్యంగా ప రాజయంపాలైంది. ఈ పోరులో ఇటలీకి చెందిన సిమొనే బొలెలీఆండ్రియా వవస్సోరీ జంటతో తలపడ్డారు.

తొలి సెట్‌లో హోరాహోరీ సాగినా బొలెలీ జోడీ పైచేయి సాధించింది. 75 మొద టి సెట్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తేరుకున్న బోపన్న జోడీ రెండో సెట్‌లో అలవోకగా విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో చెలరేగిన ఇటలీ జోడీ 62తో మూడో సెట్‌ను సొంతం చేసుకుంది దీంతో ఇటలీ జోడీ 75, 26, 62తో గేమ్‌ను ముగించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఎలాగైనా గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న బోపన్న జోడీ తదుపరి వింబుల్డన్‌పై ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News