Monday, January 6, 2025

టాప్ లేపిన బుమ్రా

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి 9 స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో అసాధారణ బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు.ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. బుమ్రా 883 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 872 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హాజిల్‌వుడ్ 860 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్‌కే చెందిన మరో స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News