- Advertisement -
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా అంతర్జాతీయ కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ షద్మాన్‌ని క్లీన్‌బౌల్డ్ చేసి బుమ్రా ఈ రికార్డు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లను పడగొట్టిన పదో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక టీమిండియా తరఫున అత్యధిక వికెట్లను పడగొట్టిన ఆరో ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. కాగా, బుమ్రా అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇప్పటి వరకు 401 వికెట్లను పడగొట్టాడు. ఇందులో టెస్టుల్లో 162, వన్డేల్లో 149, టి20లలో 89 వికెట్లు ఉన్నాయి. కాగా, భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన ఘనత అనిల్ కుంబ్లేకు దక్కుతోంది.
- Advertisement -