Sunday, December 22, 2024

బుమ్రా రికార్డు… ఈ స్పెల్ అతడికే అంకితం…

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులో బుమ్రా బుల్లెట్ల లాంటి బంతులు విసిరి ఇంగ్లాండ్ జట్టును నడ్డి విరిచాడు. ఆరు వికెట్లు తీసి 45 పరుగులు ఇచ్చాడు. ఈ టెస్టులో 150 వికెట్ల మైలు రాయిని అందుకోవడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పెల్‌ను ఎవరికి అంకితం చేస్తారని బుమ్రాను ప్రశ్నించడంతో ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఈ స్పెల్ తన తనయుడికి అంకితం ఇస్తున్నానని చెప్పాడు. తన కుమారిడితో కలిసి తొలి సారి పర్యటనకు వచ్చానని అందుకే అంకితం ఇస్తున్నానని చెప్పాడు. 2021లో ఓవల్ మైదానంలో ఓలీపోప్ వికెట్ తీసి వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నానని గుర్తు చేశాడు, ఇప్పుడు కూడా పోప్ ఔట్ చేద్దామని భావించా, లెంగ్త్ బాల్ వేద్దామని నిర్ణయం తీసుకున్నా… చివర్లో యార్కర్ సంధించడంతో అతడిని క్లీన్ బౌల్డ్ చేశానని వివరణ ఇచ్చాడు. టెస్టు ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతానని బుమ్రా వివరణ ఇచ్చాడు.

ప్రపంచంలో అతి తక్కువ 34 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ 27 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకొని రికార్డు సృష్టించాడు. 150 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా 20.28 సగటుతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను తన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన తీరు చూస్తే భారత క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆఫ్ సైడ్‌లో వికెట్ కిందపడిన తరువాత ఎలా ఆడాలి అని అంటూ బ్యాట్‌ను కిందపడేసి నిరాశతో స్టోక్స్ వెనుదిరిగాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News