- Advertisement -
ముంబై: కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వచ్చే ఐపిఎల్ సీజన్లో ఆడడం అనుమానంగా మారింది. ఐపిఎల్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి నెలలో ఐపిఎల్ సీజన్ ప్రారంభం అవుతుండగా బుమ్రా ఇప్పటి వరకు పూర్తి ఫిట్నెస్ను సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను పొట్టి క్రికెట్లో ఆడడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఐపిఎల్‌లో బుమ్రా ముంబై ఇండియన్స్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -