Monday, December 23, 2024

వన్డేలకు బుమ్రా దూరం…

- Advertisement -
- Advertisement -

గౌహతి: శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా సిరీస్‌కు దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించక పోవడంతో బుమ్రా వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బిసిసిఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. కొంత కాలంగా బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఇటీవల జరిగిన పలు సిరీస్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా ఈ సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News