Sunday, December 22, 2024

బుమ్రాకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

Jasprit Bumrah top Rank in ICC ODI rankings

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిన బుమ్రా ర్యాంకింగ్స్‌లో ఏకంగా మూడు స్థానాలు మెరుగు పరుచుకుని టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బుమ్రా 718 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి రెండో స్థానంలో నిలిచాడు. షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్) మూడో, హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) నాలుగో, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఐదో ర్యాంక్‌లో నిలిచారు.

మరోవైపు మెహదీ హసన్ (బంగ్లాదేశ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), మహ్మద్ నబి (అఫ్గాన్), రషీద్ ఖాన్ (అఫ్గాన్)లు వరుసగా టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించారు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బాబర్ 892 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌కే చెదిన ఇమాముల్ హక్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక భారత బ్యాట్స్‌మెన్‌లు విరాట్ కోహ్లి మూడో, రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, వండర్ డుసెన్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో, భారత్ మూడో స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ నాలుగో, ఆస్ట్రేలియా ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News