Wednesday, January 22, 2025

మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కోడలు ప్రమాదంలో మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మంగళవారం రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఒక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ప్రమాదం సమయంలో జస్వంత్ కుమారుడు మాన్వేంద్ర సింగ్ కూడా కారులో ఉన్నారు. చిత్రా సింగ్ ప్రాణాలు కోల్పోగా, మాన్వేంద్రకు గాయాలు తగిలాయి. ఢిల్లీ, ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక నివేదిక ప్రకారం, ఆ ప్రాంతంలో ఏర్పాటైన సిసిటివి కెమెరాలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పని చేయడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News