Monday, December 23, 2024

ట్రక్కు-కారు ఢీ: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో కారును ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతులు బిహార్‌లోని సితామర్హి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News