Monday, January 20, 2025

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

భారత జావెలిన్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. తన వివాహాన్ని రసహ్యంగా ఉంచిన చోప్రా తాజాగా బయటపెట్టారు. ఆదివారం రాత్రి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. “నా కుటుంబంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణానికి చేర్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. నీరజ్ లవ్ హిమానీ” అని చోప్రా తన పోస్ట్‌కు క్యాప్షన్‌లో పెట్టాడు. దీంతో అభిమానులు, పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చోప్రా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం చోప్రా పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. నీరజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా? అని సెర్చ్ చేస్తున్నారు.

కాగా, హిమానీ మోర్‌ అనే యువతిని నీరజ్‌ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఓ ప్రైవేట్ వేడుకలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు. హిమానీ టెన్నిస్ క్రీడాకారిణినిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ లూసియానా విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News