Tuesday, January 7, 2025

నవోదయలో టీచకులు

- Advertisement -
- Advertisement -

విద్యార్థినులకు లైంగిక వేధింపులు, నలుగురు టీచర్లపై పోక్సో కేసులు, అరెస్ట్

మన తెలంగాణ/బాన్సువాడ/ నిజాంసాగర్ : విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కేం ద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తోన్న ఉపా ధ్యాయులు కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారం రోజుల క్రితం విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఓ ఉపాధ్యా యుడిపై పోక్సో చట్టం కింద కేసు చేశారు. అనంతరం కర్ణాటకకు బదిలీ చేశారు. తా జాగా మరో ముగ్గురు ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఫిర్యాదు రావడంతో పోలీ సులు స్పందించారు. ముగ్గురు ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శివకుమార్ వెల్లడించారు.

ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం తీవ్ర కలకలాన్ని రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను కలిగించింది. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువ కావడం తో అదే సమయంలో అటువంటి ఘటన చోటు చేసుకోవడంపై సర్వత్రా అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే కీచకులుగా అవతారం ఎత్తి విద్యార్థినులను లైంగికంగా వేధించారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కించారు. పోక్సో కేసులో వివరాలు చెప్పలేమంటూ బాన్సువాడ డిఎస్‌పి చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిచ్చినట్లయింది.

ఎంతో పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీటు సాధించుకొని, ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగుపెడితే అక్కడ కొంత మంది కీచక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. గతంలో రెండు, మూడుసార్లు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం, ఈ విషయం విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించడంతో వైస్ ప్రిన్సిపల్ ఈ తతంగా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే ఆసరాగా తీసుకొని ఇటీవల మరోసారి విద్యార్థునుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంతో విద్యార్థినులు ఉపాధ్యాయుల పనితీరుపై తల్లిదండ్రులకు వివరించాగా చివరకు విద్యార్థినుల లైంగిక వేధింపుల వ్యవహారం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ విషయంలో వైస్ ప్రిన్సిపల్‌పై కూడా కేసు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ వస్తోంది. తమ పరిధిలోని పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠినంగా శిక్షించవలసిన వైస్ ప్రిన్సిపల్ వారిని వెనకేసుకురావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News