న్యూఢిల్లీ: నేడు నవంబర్ 14. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 132వ పుట్టినరోజు. ఆయన 1947 ఆగస్టు నుంచి 1964 మే వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1889లో కశ్మీర్‌లో జన్మించారు. ఆయనకు బాలలంటే చాలా ఇష్టం. బాలలు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని అనేవారు. వారే రేపటి భారత నిర్మాతలు అనేవారు. ఆయన జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు ప్రముఖ నేతలు ఆయనకు పుష్పాంజలి ఘటించారు.
నెహ్రూ పుట్టిన రోజును భారత్ ‘బాలల దినోత్సవం’గా జరుపుకుంటుంటుంది. ఐక్యరాజ్యసమితి 1954లో నవంబర్ 20న అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. అయితే భారత్‌లో కూడా 1956 కన్నా ముందు నవంబర్ 20నే బాలల దినోత్సవం జరుపుకునేవారు. కానీ 1964లో ప్రధాని నెహ్రూ కన్నుమూశాక భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది.
నెహ్రూకు మోడీ, సోనియా తదితర ప్రముఖుల పుష్పాంజలి!
- Advertisement -
- Advertisement -
- Advertisement -