మేయర్ శాంతి అధ్యక్షతన
చివరి కౌన్సిల్ సమావేశం
కౌన్సిల్ ఆమోదించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశం
మనతెలంగాణ/జవహర్‌నగర్ : జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవి కాలం ఆదివారంతో ముగియనున్నది. దీంతో శనివారం మున్సిపల్ కార్యాలయంలో నగర మేయర్ దొంతగాని శాంతికోటేష్‌గౌడ్ అధ్యక్షతన పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ గతంలో కౌన్సిల్ సమావేశంలో తీర్మానించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడిచిన సంవత్సర కాలంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం వంటి ప్రజల మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మేయర్ పేర్కొన్నారు. తనకు సహాకరించిన అధికారులకు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ డాకు నాయక్, డిఈ మాధవచారి, మేనేజర్ నాగేష్‌బాబు, ఆర్‌ఓ వెంకటేశ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.