Sunday, December 22, 2024

దాడి జరిగిందని తప్పుడు ఫిర్యాదు… జవాన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : జనం దృష్టిని ఆకర్షించడానికి, మరింత పెద్ద ఉద్యోగం వస్తుందన్న ఆశతో కేరళకు చెందిన ఓ సైనికుడు ఆడిన నాటకం చివరకు బయటపడింది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు దాడిచేసి , శరీరంపై నిషేధిత ‘పీఎఫ్‌ఐ’ అని రాశారంటూ ఆ సైనికుడు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. చివరకు దర్యాప్తులో అతడు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు పోలీస్‌ల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ నాటకంలో ఆ సైనికుడితోపాటు అతడికి సహకరించిన వ్యక్తిని కూడా పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. కేరళ లోని కడక్కల్‌కు చెందిన షైన్ కుమార్ అనే ఆర్మీ జవాన్… రాజస్థాన్ లోని సైనిక ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. సెలవులపై స్వస్థలానికి వచ్చిన కుమార్ ఆదివారం రాత్రి తన ఇంటికి సమీపంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆరోపించాడు. తన చేతులను టేప్‌తో కట్టేసి, వీపుపై “పీఎఫ్‌ఐ”అని రాశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది కాస్త సంచలనం కావడంతో పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు. చివరకు అసలు విషయం బయటపడింది.

తనపై ఎలాంటి దాడి జరగలేదని, అందరి దృష్టి పడాలని ఇలా చేసినట్టు సైనికుడి స్నేహితుడు వెల్లడించాడు. ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని, స్నేహితుడు చెప్పినట్టుగా అతడి వీపుపై పీఎఫ్‌ఐ అని రాశానని, కుమార్ తనను కొట్టాలని చెప్పినా, తాగి ఉన్నందున ఆ పనిచేయలేదన్నాడు. చేతులకు, మూతికి మాత్రం ప్లాస్టర్ వేసినట్టు ఒప్పుకున్నాడు. అతడి ఇంటి నుంచి ఆకుపచ్చ రంగు డబ్బా, ఓ బ్రష్, టేపును పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి స్టేట్‌మెంట్లు రికార్డు చేశామని, ఎవరినీ అరెస్టు చేయలేదని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News