- Advertisement -
ఓ జవాన్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజిందర్ అనే జవాన్ బుధవారం ఉదయం గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -