Saturday, December 21, 2024

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం.. జవాన్‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పపడ్డారు. బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లిలో శివాజీ(28) అనే జవాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెలవుపై వారం క్రితం మమ్మాయిపల్లికి వచ్చిన శివాజీ.. మృతి చెందడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News