Monday, December 23, 2024

షారుఖ్, అట్లీ కాంబినేషన్‌లో ‘జవాన్’

- Advertisement -
- Advertisement -

‘Jawan’ in Shahrukh, Attlee combination

 

బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా వరుస బ్లాక్‌బస్టర్ విజయాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జవాన్’ టైటిల్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించింది. అత్యున్నత స్థాయి తారాగణం, సాంకేతిక నిపుణులతో భారీ యాక్షన్ సీక్వెన్సులు గల ఈ పాన్ ఇండియా చిత్రం యావత్ సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప వేడుకలా ఉండబోతుందని ఫిల్మ్‌మేకర్స్ చెప్పారు. దక్షిణాదిలో రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వచించిన అట్లీ ఇప్పుడు భారీ అంచనాలున్న ’జవాన్’తో తన మ్యాజిక్‌ను దేశ వ్యాప్తంగా చూపించబోతున్నారు. అన్ని ఊహాగానాలకు స్వస్తి చెబుతూ.. ‘జవాన్’ చిత్రాన్ని టీజర్ వీడియోతో చిత్ర యూనిట్ ప్రకటించింది. టీజర్‌లో షారుఖ్ ఖాన్ గాయపడి కట్టుతో రగ్డ్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించారు.

ఈ ఫస్ట్ లుక్ ‘జవాన్’ లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెప్పకనే చెప్పింది. గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 2023, జూన్ 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ “యూనివర్సల్ కథ ఇది. ఈ విలక్షణమైన చిత్రాన్ని రూపొందించిన క్రెడిట్ దర్శకుడు అట్లీకి దక్కుతుంది. నేను యాక్షన్ చిత్రాలను ఇష్టపడుతాను కాబట్టి ‘జవాన్’ నాకు అద్భుతమైన అనుభూతినిచ్చింది. టీజర్ రాబోయే అద్భుతానికి చిన్న గ్లింప్స్ లాంటింది మాత్రమే” అని అన్నారు. దర్శకుడు అట్లీ మాట్లాడుతూ “ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా… విజువల్ వండర్‌గా వుంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనుకుంటున్నాను”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News