Friday, January 24, 2025

కన్నీటితో కడసారి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

వాజేడు : విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడిన జవాన్ మహేందర్ కుమార్ కు బంధువులు ఆదివారం కన్నీటి విడ్కోలు పలికారు. ఐటిబిపి నుంచి వచ్చిన పోలీసులు అధికారక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. చత్తీస్‌ఘడ్ సోన్‌పూర్‌లో ఐటిబిపి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవలే సెలవు తీసుకుని స్వగ్రామమైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని శ్రీరాంనగర్ గ్రామానికి వచ్చాడు. తన మూడు నెలన బాబును తనివితీరా చూసుకుందామనుకున్న మహేందర్ కుమార్ అప్పటి వరకు అందరితో కలివిడిగా తిరిగి ఇప్పుడే వస్తాను అని చెప్పి విద్యుత్ షాక్ రూపంలో తిరిగిరాని లోకలకు వెళ్ళిపోయాడు.దీంతో గ్రామంలోని ప్ర జలు కన్నీటి సంద్రమయ్యారు.

Also Read: ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం

ఆదివారం మహేందర్ కడసారి చూపుకోసం బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు భారీగా హాజరయ్యారు. ఐటిబిపి ఇన్స్‌పెక్టర్ సునీల్ పన్వార్ మహేందర్ బౌతికకాయంపై జాతీయ జెండాను వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం సునీల్ పన్వార్, వాజేడు ఎస్సై రేఖ అశోక్ మృతుడు మహేందర్ కుమార్ తల్లిదండ్రులను, భార్య ప్రసన్నలకు తమ ప్రగాడ సానుభుతిని తెలిపారు. ఐటిబిపి అన్ని విధాల ఆదుకుంటుందని అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. ఐటిబిపి నుండి అంత్యక్రియల కోసం రూ.23,000 లను ఆయన అందించారు. సీఆర్‌ఫిఎఫ్ బెటాలియన్ నుండి అంత్యక్రియల కోసం రూ.50,000లను అందజేశారు. అనంతరం అధికారక లాంచానాలతో 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు ఆర్పించారు. మహేందర్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News