Sunday, December 22, 2024

చుట్టపుచూపుగా వచ్చి మహిళపై జవాన్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

లక్నో: బంధువుల ఇంట్లో మహిళపై జవాన్ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ప్రొవిన్సిల్ ఆర్మడ్ కానిస్టేబులరీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పిలిభిత్‌లో తన బంధువుల ఇంటికి ఆనంద్ కుమార్ వెళ్లాడు. బంధువుల ఇంట్లో మహిళ ఒంటరిగా కనిపించడంతో డోర్ లాక్ చేసి ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. రూమ్‌లో నుంచి కేకలు వినపడడంతో బయట నుంచి ఆమె మేనకోడలు లాక్ చేసి స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆనంద్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News