Wednesday, January 22, 2025

పెళ్లైన రెండు రోజులకే జవాన్ మర్మాంగాలపై పొడిచిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

పాట్నా: పెళ్లైన రెండు రోజులకు నవవరుడు మర్మాంగాలపై ప్రియురాలు పొడిచిన సంఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సూర్య భూషన్ కుమార్ అనే వ్యక్తి సిఆర్‌పిఎఫ్‌లో జవాన్‌గా పని చేస్తున్నారు. నేహా కుమార్ అనే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. సూర్యకు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో సూర్యను పాట్నాకు రమ్మని నేహా కబరు పంపింది. జూన్ 3న సూర్య పాట్నాకు చెరుకొని తన ప్రియురాలు నేహాను కలిశాడు. జూన్ 6న కోర్టులో ఇద్దరు వివాహం చేసుకున్నారు.

Also Read: పరస్త్రీ మోజులో ఆర్మీ అధికారి..కోర్టు మార్షల్ శిక్ష ఖరారు

మరో అమ్మాయితో సూర్య కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేయడంతో పెళ్లిని రద్దు చేసుకుందామని నేహాతో సూర్య చెప్పాడు. ఇద్దరు కలిసి ఓ రూమ్‌లో ఉన్నారు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అతడిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడ్ని బెదిరించింది. ఘర్షణ జరుగుతుండగా కత్తి తీసుకొని సూర్య మర్మాంగాలపై పొడవడంతో అతడు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. అతడిని స్థానిక ఆస్పత్రికి హోటల్ సిబ్బంది తరలించారు. పోలీసులు నేహాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News