Monday, December 23, 2024

ప్రేమ విఫలం కావడంతో… రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమ విఫలం అయిందని మనస్థాపం చెందిన ఓ జవాన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌కు చెందిన దేవేందర్‌కుమార్ 2021 బ్యాచ్‌లో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవేందర్ కుమార్ ఉదయం బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద ఉంటున్న సిఆర్‌పిఎఫ్ ఐజి మహేష్ చంద్ర వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నాడు.

కాగా దేవేందర్ కుమార్ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో యువతి దేవేందర్‌ను దూరం పెట్టడంతో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే విధుల్లో ఉండగానే తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News