Monday, December 23, 2024

రొమాంటిక్‌గా ‘ఛలోనా…’

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చి త్రం సెప్టెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ఛలోనా… సాంగ్ విడుదలైంది. అనిరుద్ రవిచందర్ సంగీత సారధ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని ఈ పాటను ఆదిత్య ఆర్.కె, ప్రియా మాలి పాడారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ పాటను రాశారు.

రొమాంటిక్ సాంగ్స్ రారాజుగా పిలవబడే షారుఖ్ ఖాన్ మరోసారి ఛలోనా… సాంగ్‌లో తన మార్క్ చూపించారు. ఈ రొమాంటిక్ సాంగ్‌లో షారుఖ్ ఖాన్, నయనతార జంట చూడచక్కగా ఉంది. ఈ పాటకు ఫరా ఖాన్ కొరియోగ్రఫీ అందించారు. ఆమె తనదైన స్టైల్లో సిగ్నేచర్ స్టెప్పులతో మెప్పించారు. జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News