Thursday, January 23, 2025

జవాన్ ప్రాణం తీసిన హనీట్రాప్…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: హనీట్రాప్ పేరుతో ఓ మహిళ వేధించడంతో జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రంలో మడికేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సందేశ్ అనే వ్యక్తి భారత సైన్యంలో సైనికుడిగా పని చేస్తున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో రాసి ఇంట్లో నుంచి సందేశ్ బయటకు వెళ్లిన తరువాత తల్లి గుర్తించింది. వెంటనే మడికేరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగారు. హంపినకెరెలో నీటిలో ఆయన మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 40 అడుగుల లోతులో మృతదేహం ఉన్నట్టు గజ ఈతగాళ్లు గుర్తించడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటకు తీశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ లేఖ ఆధారంగా జీవిక అనే మహిళ, కానిస్టేబుల్, రిసార్టు యజమాని వేధించినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News