Wednesday, January 22, 2025

ఆకట్టుకుంటోన్న ‘జవాన్’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జవాన్’. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరెకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా, దీపికా పడుకొనె, ప్రియమణిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజగా యాక్షన్ ఎపిక్ మూవీ ట్రైలర్ విడుదలైంది. గూజ్ బమ్స్ తెప్పించే యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ‘జవాన్’ ట్రైలర్ ఫ్యాన్స్, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది.

రీసెంట్ టైమ్ లో ‘జవాన్ ప్రివ్యూ’ పేరుతో విడుదల చేసిన వీడియోకు అమేజింగ్ రెస్పాన్స్ రావటంతో పాటు అందరికీ ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిస్తుందని ఫిక్స్ అయ్యారు. సినిమాలోని సాంగ్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులు, షారూఖ్ ఖాన్ మాగ్నటిక్ పెర్ఫామెన్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో విడుదలైన జవాన్ ట్రైలర్ చూసిన అభిమానులు ఊర్రుతలూగుతున్నారు. శుక్రవారం నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News