Wednesday, January 22, 2025

ఛత్తీస్ గఢ్ లో ఎన్‌కౌంటర్: ముగ్గురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. టేకులగూడ వద్ద జవాన్లు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె రైఫిళ్లు, సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News