Monday, December 23, 2024

మందుపాతర పేలి ఇద్దరు జావాన్లకు తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

కాంకేర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో శిక్షణ కార్యక్రమంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. అటవీప్రాంతాల్లో మందుపాతర్ల వెలికితీయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ఇచ్చేటప్పుడు మందుపాతర పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జావాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జావాన్లను తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ట్రైనింగ్ కళాశాలలో బస్తర్ ఫైటర్స్ కు శిక్షణ ఇస్తుండగా ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News