Sunday, March 30, 2025

ట్రంప్ సర్కార్ లో మరో భారతీయ సంతతి వ్యక్తి

- Advertisement -
- Advertisement -

అమెరికా ఆరోగ్య సంస్థ అధిపతిగా భారతీయ సంతతికి చెందిన జై భట్టాచార్య నియమితులయ్యారు. అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా భారతీయ సంతతికి చెందిన జై భట్టాచార్యను నియామకాన్ని అమెరికా సెనెట్ ధృవీకరించింది.
భట్టాచార్య అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ గా ఉన్నారు.అమెరికా 119వ కాంగ్రెస్ సెనెట్ లో రోల్ కాల్ ఓటింగ్ మొదటి సెషన్ లోనే జై భట్టాచార్య నియామకం 53-47 ఓట్లతో ఆమోదం పొందింది.అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నామినేషన్ ప్రకటనలో జై భట్టాచార్య స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త పాలసీ ప్రొఫెసర్ అనీ,

నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసర్చ్ లో రీసర్చ్ అసోసియేట్ అనీ, స్టాన్ ఫోర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ పాలసీ రీసర్చ్
, స్టాన్ ఫోర్డ్ ఫ్రీమాన్ స్పాగ్లి ఇనిస్టిట్యూట్ , హూవర్ ఇనిస్టిట్యూషన్ సీనియర్ ఫెలో అని పేర్కొన్నారు.ప్రొఫెసర్ జై భట్టాచార్య, కొత్తగా నియమితులైన అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖమంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ తో కలిసి పనిచేసి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో వైద్య పరిశోధనల ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని
ప్రెసిడెంట్ ట్రంప్ ఆ ప్రకటనలో విశ్వాసం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News