Tuesday, January 21, 2025

జెండా ఎత్తని జైషా

- Advertisement -
- Advertisement -

త్రివర్ణ పతాకాన్ని అవమానించిన హోం మంత్రి అమిత్ షా
కుమారుడు భారత్ క్రికెట్ జట్టు విజయానందంలో జాతీయ
జెండాను చేబూనడానికి నిరాకరణ విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు

దుబాయ్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పుత్రుడు జైషా భారతీయ జెండాను అవమానించారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డా యి. దుబాయ్‌లో ఆయన వ్యవహరించిన తీ రు విమర్శలకు దారితీసింది. ప్రత్యేకించి యువత ‘ఏ క్యా హై జై’ అని చీకొడుతూ ట్వీ ట్లు చేస్తున్నారు. ఆసియా కప్ క్రికెట్ పోటీ లో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో రోహిత్ సేన పాక్‌పై విజయషా టు కొట్టింది. ఆ తరువాత స్టేడియంలోని భారతీయులు, అభిమానులు త్రివర్ణ జెండాలు పట్టుకుని జై భారత్ నినాదాలతో హోరెత్తేలా చేశారు. ఈ దశలో అక్కడనే ఉన్న బిసిసిఐ కార్యదర్శి కూడా అయిన జై షాకు కొందరు క్రికెట్ ఫ్యాన్స్ భారతీయ జెండాను అందించేందుకు యత్నించగా ఆయన దానిని పక్కకు తోసేశారు.

సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో ఇప్పుడు వైరల్ అయ్యాయి. త్రివర్ణ పతాకాన్ని జై షా అవమానించడంపై క్షణాల్లోనే శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఇది 133 కోట్ల మందిని అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు. అయితే తరువాత ఆమెనే స్పందిస్తూ ఆయన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినందున ఈ విధంగా వ్యవహరించి ఉంటారని అనుకునేందుకు వీలుందని, అయితే ఆయన జాతీయ జెండాను పక్కకునెట్టడం ఏ మేరకు సముచితమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత జై రాం రమేష్ స్పందిస్తూ కుమారుడు షా తనకు తన గొప్ప తండ్రి ఉన్నాడు, త్రివర్ణ పతాకం ఇతరులు తీసుకోవచ్చు అనే ధోరణిలో ఉందన్నారు.

జై షా ముందుకు వచ్చిన జెండా ఖాదీ జెండా అయి ఉంటుంది, పాలిస్టర్ జెండా అయి ఉంటే ఈ విధంగా చేసి ఉండేవారు కాదేమో అని కాంగ్రెస్ లీడర్ అజయ్‌కుమార్ ట్వీట్ పెట్టారు. టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మరింత ఘాటుగా స్పందిస్తూ పాపం ఈ అభినవ యువరాజుకు జాతీయ గౌరవం లేదా దేశ గర్వకారణం గురించి అంతగా తెలిసినట్లు లేదని అన్నారు. అధికార పార్టీవారమనే ధోరణి తండ్రి నుంచి తనయుడికి బాగా అబ్బినట్లు ఈ వీడియోద్వారా దేశమంతా తిలకించవచ్చు అని స్పందించారు. వారు ఎక్కువగా నాటకాలు ఆడుతారు, విలువలు తక్కువగా పాటిస్తారు. జుమ్లాలకు దిగుతారు. దేశభక్తిని తోసిరాజంటారు అని ట్వీట్ వెలువరించారు. టిఎంసి సీనియర్ నేత అయిన డెరెక్ ఒ బ్రెయిన్ తమ స్పందనలో అమిత్‌షాపై విరుచుకుపడ్డారు. ఈ త్రివర్ణ సంబరపు వీడియో తిలకించిన తరువాత ఆ చర్య చీమకుట్టేలా అయినా చేసిందా? ఏ కోశానా అయినా గాయపర్చిందా? తెలియచేయగలరు సీనియర్ షా గారూ అని ఆంగ్లంలో వ్యాఖ్యానించారు.

మీరు తరచూ చెప్పే జాతీయ సెంటిమెంట్లు ఈ కోణంలోకి వస్తాయా? అని నిలదీశారు. పోనీ మీ కుమారుడు కాబట్టి ఈ చర్యను చూసీ చూడనట్లు మీరు వదిలేసి ఇతరులను కూడా అదే పాటించమని హుకుం జారీ చేస్తారా? అని ప్రశ్నించారు. చింతిస్తున్నట్లు చెప్పడాలు, సాకులు వెతకడాలు అవసరం లేదని నిర్థిష్ట జవాబులు కావాలి, ఇది ఆగ్రహ భారతీయుడి ప్రశ్న అని తెలిపారు. ఆయన ఆసియన్ క్రికెట్ కప్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రోటోకాల్ మేరకు జై షా త్రివర్ణ పతాకాన్ని స్టేడియంలో పట్టుకోలేదని బిజెపి వాదించడాన్ని టిఎంసి ప్రతినిధి సాకేత్ గోఖలే ఖండించారు. మరి భారతీయత సంగతి ఏమిటని ప్రశ్నించారు.

ప్రత్యర్థులను ఏదో విధంగా తప్పుపట్టి వారిని బద్నామ్ చేసే బిజెపికి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి జరిగిన అవమానం ఏ స్థాయిలో ఎవరు చేశారనేది తెలియదా? అని నిలదీశారు. ఆదివారం రాత్రి దుబాయ్ క్రికెట్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రతిభతో పాక్‌ను కుప్పకూల్చారు. పరుగులకు కట్టడి చేయడం, తరువాత పరుగులు తీయడంతో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఖండాంతర స్థాయిలో యువత జోష్‌కుదారితీసిన దశలో అమిత్ షా కుమారుడి నిర్వాకం వికార ఘట్టంగా మారిందని ఎడతెరిపిలేని నెట్‌కామెంట్లు రన్‌లుగా వచ్చిపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News