Friday, November 8, 2024

ఐసిసి చైర్మన్‌గా జై షా

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్త చైర్మన్‌గా భారత్‌కు చెందిన జై షా ఎన్నికయ్యారు. జై షా ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, జై షా ఐసిసి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1న ఆయన ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతారు. రెండేళ్ల పాటు జై షా ఈ పదవిలో కొనసాగుతారు. ఇదే సమయంలో ఐసిసి చైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా గుర్తింపు దక్కించుకున్నారు.

జై షా 35 ఏళ్ల వయసులో ఐసిసి చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. ఇదిలావుంటే భారత్ తరఫున ఈ పదవిని దక్కించుకున్న ఐదో వ్యక్తి జై షా. మరోవైపు ప్రస్తుతం ఐసిసి చైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే కొనసాగుతున్నారు. ఆయనకు మరో దఫా చైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉన్నా..ఈ పదవిని చేపట్టేందుకు విముఖత చూపారు. దీంతో ఆయన స్థానంలో తాజాగా బిసిసిఐకి చెందిన జై షాకు ఈ చైర్మన్ పదవి దక్కింది.

కొన్నేళ్ల క్రితం జై షా భారత క్రికెట్‌లో ప్రవేశించారు. క్రికెట్ అభివృద్ధికి జై షా పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశవాళీ క్రికెట్‌ను పటిష్టం చేసేందుకు జై షా పలు చర్యలు చేపట్టారు. కాగా, ఐసిసి చైర్మన్ పదవి దక్కించుకున్న జై షాకు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News