Wednesday, January 22, 2025

జయా బచ్చన్‌కు రూ.1,578 కోట్ల ఉమ్మడి ఆస్తులు

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ ఎన్నికలఅఫిడవిట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ నుంచి రాజ్యసభలో ఐదవసారి ప్రాతినిధ్యం వహించడానికి మంగళవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అలనాటి సినీ నటి, రాజకీయ నేత జయా బచ్చన్ ఆస్తులు తన భర్త అమితాబ్ బచ్చన్‌తో కలిపి రూ. 1,578 కోట్లు ఉన్నాయి. జయా వచ్చన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జయా బచ్చన్ వ్యక్తిగత నికర ఆస్తుల విలువ రూ. 1,63,56,790 ఉంది.

అదే కాలంలో ఆమె భర్త అమితాబ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ రూ. 273,74,96,590 గా ఉంది. ఉమ్మడిగా వారి చరాస్తుల విలువ రూ. 849.11 కోట్లు ఉండగా స్థిరాస్తుల విలువ రూ. 729.77 కోట్లు ఉంది. జయా వచ్చన్ బ్యాంకు బ్యాలెన్స్ రూ. 10,11,33,172 ఉండగా అమితాబ్ బచ్చన్ బ్యాంకు బ్యాలెన్స్ రూ. 120,45,62,083 ఉంది. బచ్చన్ దంపతుల విలాసవంతమైన జీవితానికి ఈ అఫిడవిట్ అద్దం పడుతోంది. జయా వచ్చన్‌కు రూ. 40.97 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. రూ. 9.82 లక్షల విలువైన ఒక కారు ఉంది.

అమితాబ్ వచ్చన్‌కు రూ. 54.77 కోట్ల విలువైన బాంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆయనకు 16 వాహనాలు ఉండగా అందులో రెండు మెర్సిడిస్, ఒక రేంజ్ రోవర్ ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ. 17.99 కోట్లు ఉంది. బచ్చన్ దంపతులకు వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఈ ఆస్తులు సమకూరాయి. వివిధ వాణిజ్య ప్రకటనలలో నటించడం, తన ఎంపి జీతం, వృత్తిపరమైన ఫీజు కింద లబించే ఆదాయంతో జయా బచ్చన్‌కు ఆస్తులు సమకూరాయి. అమితాబ్ వచ్చన్‌కు వడ్డీలు, అద్దెలు, డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్, సోలార్ ప్టాంటు ద్వారా సమకూరిన ఆదాయంతో ఈ ఆస్తులు సమకూరినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News