Thursday, March 20, 2025

సినిమా పేరు నచ్చేలేదు… అందుకే ఆ సినిమా ఫ్లాప్: జయ బచ్చన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ మూవీ. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ నటి, ఎంపి జయబచ్చన్‌కి నచ్చలేదట. అందుకు కారణం ఆ సినిమా పేరే. అందుకోసం ఆ సినిమాను ఇప్పటివరకూ ఆమె చూడలేదట.

2017లో విడుదలైన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమాలో అక్షయ్‌కుమార్‌కి జంటగా భూమి ఫడ్నేకర్ నటించింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాయిలెట్ల కొరతను ఎత్తి చూపుతూ.. ఈ సినిమాను తెరకెక్కించాడు ధర్శకుడు శ్రీనారాయణ్ సింగ్. అయితే సూపర్ హిట్ అయిన ఈ సినిమా మాత్రం జయబచ్చన్ దృష్టిలో ఫ్లాప్ అట.

సినిమాలు చూసే విషయంలో తనకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని.. టైటిల్ నచ్చకపోతే ఆ సినిమాకూడా చూడను అని జయ అన్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ టైటిల్‌ని చూడండి. అలాంటి టైటిల్ ఉన్న సినిమాని నేను ఎప్పుడు చూడాలని అనుకోలేదు. ఛీ ఛీ అదేం పేరు? ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్‌యే’ అని జయ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News