Wednesday, January 22, 2025

నన్ను అట్లా పిలవొద్దు !

- Advertisement -
- Advertisement -

రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పై  జయా బచ్చన్ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్,  జయా భాధూరిని ఉద్దేశించి ‘జయా అమితాబ్ బచ్చన్’ అని సంబోధించారు. దానికామె తనని అలా పిలవొద్దని అన్నారు. తనని జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోయేదన్నారు. దానికి హరివంశ్ నారాయణ్ స్పందిస్తూ…ఇక్కడ పూర్తిపేరు రాసి ఉన్నందునే అలా పిలవాల్సి వచ్చిందన్నారు.

దానికి జయా బచ్చన్ అసహనాన్ని చాటుతూ ‘మహిళలను భర్త పేరుతో మాత్రమే గుర్తిస్తారా? వారికంటూ స్వంత ఉనికి ఉండదా? స్వంతంగా విజయాలు సాధించడం లేదా?…’’అంటూ నిప్పులు చెరిగారు. ఒకప్పుడు నటి అయిన జయా బచ్చన్ తర్వాత రాజకీయాలలోకి వెళ్లారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఐదు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మహిళల హక్కులపై ఎప్పుడూ పార్లమెంటులో గళం విప్పుతుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News