Wednesday, January 22, 2025

నటి జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై వదంతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాధురి(94) అనారోగ్యంతో కన్ను మూశారంటూ వదంతులు వెలువడుతున్నాయి. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారంటూ వదంతుల ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని సమాచారం. అయితే ఆమె ఇటీవల వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారు. వదంతులను నమ్మి అభిషేక్ బచ్చన్ భోపాల్ కు హుటాహుటిన వెళ్లారు. కానీ వ్యాపించిన వార్తల్లో నిజం లేదన్నారు. కాగా ఇందిరా భాదురి కేర్ టేకర్ ఆమె బాగానే ఉన్నట్లు తెలిపారు.

Abhishek Bachchan

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News