Monday, January 20, 2025

రాష్ట్ర గీతానికి తుదిమెరుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. జయ జయహే తెలంగాణ గీతం రూపకల్పనపై బుధవారం సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, పలువురు పాల్గొన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి బృందం పాడి వినిపించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం పురస్కరించుకుని రా ష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందు కు భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర గేయం, చిహ్నంలో చిన్న చిన్న మార్పులు చేయనుంది. ఈ మా ర్పుల తర్వాత జూన్ 2న నూతనంగా ఆవిష్కరించనున్నా రు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిరూపు సిద్ధమైంది.

పో రాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన చిహ్నంపై బుధవారం సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత చిహ్నంలో రాచరికం గుర్తులు ఉన్నందున ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్తగా తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపంపై సిఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జెఎసి నేత రఘు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News