Wednesday, December 25, 2024

పెద్దాయన తండ్రి వంటివారు: ములాయం మరణంపై జయప్రద

- Advertisement -
- Advertisement -

Jaya Prada expressed grief over the death of Mulayam

లక్నో: రాజకీయాలు అధికారాలు సంగతి పక్కనపెడితే ములాయం జీ తనకు తండ్రి వంటి వారని సినీనటి, యుపి రాజకీయాలలో ఎంపిగా చలామణిలో వచ్చి తెరమరుగైన జయప్రద తెలిపారు. ములాయం అంటే అందరికీ అభిమానం, ఆయన మరణం అందరికి కన్నీరు తెప్పిస్తుందని స్పందించారు. తన జీవితంలో అత్యంత కీలకమైన మలుపునకు ఆయన దారితీశారు. ఆయన మరణం తనకు బాధాకరంగా మారిందని, దీనిని జీర్ణించుకోలేకపోతున్నానని జయప్రద తెలిపారు. ఆయన రాజకీయ పెద్దగానే కాకుండా ఓ కుటుంబ పెద్దగా వ్యవహరించి పలువురి మన్ననలు పొందారని తనకు గురువు, తండ్రి అయ్యారని, రాజకీయాల గురించి తెలియని తనను పార్టీలో కీలక బాధ్యతల స్థాయికి తీసుకువెళ్లారని, ఆయన వెళ్లిపోవడం తనకు దీపావళి లేని యుపిగా అన్పించిందని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News