Tuesday, December 24, 2024

కృష్ణ పార్థివదేహాన్ని చూసి ఏడ్చేసిన జయప్రద

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ చిత్రపటానికి టాలీవుడ్ సీనియర్ నటి జయప్రద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మాలయా స్టూడియోస్ వద్ద అభిమానుల కోసం పార్థివ దేహాన్ని ఉంచిన విషయం తెలిసిందే. తన సహనటుడు కృష్ణ ఆకస్మిక మరణం తర్వాత జయప్రద ఉద్వేగానికి లోనయ్యారు. నటుడికి నివాళులర్పిస్తున్నప్పుడు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మహేష్ బాబును ఆమె ఓదార్చారు.

నటి జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. నటుడు కృష్ణ ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించేవారని, తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారని అన్నారు. వారిద్దరూ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించామని, అతని గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు నటి జయప్రద. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే కృష్ణ అంతిమయాత్రకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News