Sunday, January 19, 2025

తెలంగాణ ప్రజల గుండెల్లో జయ శంకర్‌కు సముచిత స్థానం

- Advertisement -
- Advertisement -

వనస్థలిపురం: తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రొఫెసర్ జయ శంకర్ సార్ చిరస్థాయిగా నిలచి పోతారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దెవిరెడ్డి సుదీర్ రెడ్డి వెల్లడించారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా వనస్థలిపురంలోని జయ శంకర్ సార్ పార్క్ నందు ఉన్న జయశంకర్ సార్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు.

అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయ శంకర్ సార్ అని వెల్లడించారు. జయ శంక్ సార్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా, బిఆర్‌ఎస్ నాయకులు సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News