Wednesday, January 22, 2025

దివంగత జయలలిత 76వ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

చెన్నై : దివంగత మాజీ సిఎం జయలలిత 76 వ జయంతి సందర్భంగా శనివారం ఎఐఎడిఎంకె నేతలు , మాజీ ముఖ్యమంత్రి ఈడప్పాడి కె. పళనిస్వామి జయలలిత చిత్ర పటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. పళనిస్వామి నివాసంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎఐఎడిఎంకె పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం కనిపించింది. వందలాది కార్యకర్తలు స్వీట్లు పంచారు. అమ్మగా అందరిచే మన్ననలు పొందిన జయలలిత చూపించే బాటలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం రేయింబవళ్లు కృషి చేయాలని పళనిస్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బహిష్కృత ఎఐఎడిఎంకె నేత ఓ పన్నీర్‌సెల్వం కూడా తన మద్దతుదార్లతో కలిసి చెన్నై లోని జయలలిత విగ్రహానికి పూలమాలలు అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News