Sunday, April 6, 2025

ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి..

- Advertisement -
- Advertisement -

జయ ఆభరణాలు తీసుకెళ్లండి
తమిళనాడుకు బెంగళూరు కోర్టు ఆదేశం

బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు సిటీ సివిల్ కోరు ్టసంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు. వజ్రాల అభరణాలను తీసుకెళ్లాలని చెప్పింది. ఇందుకు ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బంది సమక్షంలో మార్చి 6,7 తేదీల్లో ఈ అభరణాలను తీసుకెళ్లాలని స్పష్టం చేసింది.తమిళనాడు రాష్ట్రానికి ఆభరణాలను అప్పగించే ఉద్దేశంతో ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్‌కోర్టు స్పెషల్ జడ్జి మోహన్ ఆదేశించారు.

జయలలిత మరణించిన ఏడేళ్ల తర్వాత ఆమెకు సంబంధించిన ఆభరణాల అప్పగింత కార్యక్రమం ప్రారంభం కావడం గమనార్హం. అక్రమ ఆస్తుల కేసులో 2014సెప్టెంబర్‌లో అప్పటి ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి కున్హా ఇచ్చిన తీర్పులో శశికళ, జె ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా నిర్ధారించారు. నాలుగేళ్ల జైలుశిక్ష విధించారు. జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికీ తలా 10 కోట్లు చొప్పున జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News