Wednesday, January 22, 2025

తమిళనాడుకు జయలలిత ఆభరణాల బదలీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశం

బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలీ చేయాలని బెంగళూరులోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. జయలలిత ప్రభృతులపై గల అక్రమ ఆస్తులలో సాక్షాధారాలతో కూడిన ఆ బంగారు, వజ్రాల ఆభరణాల అమ్మకానికి తమిళనాడు ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుంది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం కర్నాటకలో విచారణ జరిగింది.

అందువల్ల సాక్షాధారాతో కూడిన ఆ వస్తువులు ఇప్పుడు కోర్టు కస్టడీ కింద కర్నాటక కోశాగారంలో ఉన్నాయి. 32వ అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హెచ్ ఎ మోహన్ సోమవారం వాటి బదలీ ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆ ఆస్తులకు జయలలిత వారసులు అర్హులు కారని కోర్టు ఇంతకుముందు ఆదేశించింది. అందువల్ల జయలలిత మేనకోడలు, అల్లుడు జె దీప, జె దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక సిబిఐ కోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News