సుమ టాలెంట్‌లో పది శాతం మిగిలిన వారు ప్రదర్శించినా ‘జయమ్మ పంచాయితీ’ బిగ్ హిట్ అవుతుంది అని స్టార్ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మాతగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా తెరకెక్కిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం ఈనెల 6 విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీ జ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సుమ నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నాని మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చూశాక హిట్ అవుతుంది అని అనిపించింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది అని తెలిపారు. సుమ మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీనటులతో పాటు కీరవాణి సంగీతంతో మా సినిమాకు బలం చేకూరింది. ఈ సినిమాకు రామ్‌చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ రావడం ఆనందంగా ఉంది. తాజాగా ఈనెల 3న కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని తెలిపారు. చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, ఏదో చిన్న కథతో సినిమా తీయాలనుకున్న నాకు సుమగారు ఈ కథలోకి రావడం, ఆ తర్వాత సినీప్రముఖులు ప్రమోషన్‌కు సహకరించడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో సుమ నటన గురించి వర్ణించలేము. ఈ సినిమాకు కీరవాణి పనిచేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, గీత రచయిత హరి రామ జోగయ్య, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రాజీవ్ కనకాల, శ్రీకృష్ణ, షాలినీ తదితరులు పాల్గొన్నారు.
Jayamma Panchayathi Pre Release Event