Wednesday, January 22, 2025

భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా…

- Advertisement -
- Advertisement -

Jayamma panchayathi release date on May 6th

 

పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే విడుదల చేయగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇక సినిమా యూనిట్ ‘గొలుసుకట్టు ఘోషలు’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. ఎంఎం కీరవాణి ఈ పాటని హృదయాన్ని కదిలించేలా కంపోజ్ చేశారు. వినగానే భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా ఉంది ఈ పాట. చారు హరిహరన్, కీరవాణి ఈ పాటను హృదయాన్ని తాకేలా ఆలపించగా, చైతన్య ప్రసాద్ అర్ధవంతమైన సాహిత్యం అందించారు. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాన్ని, ఆ పాత్రలోని ఎమోషనల్ కోణాన్ని ఈ పాట ఆవిష్కరించింది. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయతీ’ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News