Sunday, January 19, 2025

ఐఈఈఈ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్‌లో జయముఖి విద్యార్థి

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: మండలంలోని జయముఖి అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం మూడవ సంత్సరం చదువుతున్న పసునూరి రాహుల్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 4500 మంది విద్యార్థులు పాల్గొన్న క్విజ్ పజ్లర్ పోటీల్లో పాల్గొని ప్రపంచంలోనే టాప్ 2 పజ్లర్‌గా, దేశంలో నంబర్ వన్ విజేతగా నిలిచాడు.

భారతదేశం నుంచి పాల్గొన్న వేర్వేరు ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్‌ల్లో హైదరాబాద్ సెక్షన్‌కి చెందిన జయముఖి స్టూడెంట్ బ్రాంచ్‌కు చెందిన ఇతర విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడంతో ఎంతో ప్రశంసనీయమని, ఇది కళాశాలకు, దేశానికి గర్వకారణమన్నారు. ఈ విద్యార్థి సాధించిన విజయానికి యునైటెడ్ స్టేట్స్ ఐఈఈఈ కొల్లబ్రోటెక్ ఫజలెర్స్ నుంచి పశంసా పత్రం, టీ షర్ట్ కొరియర్ ద్వారా అందుకున్నామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జానకీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం శంకర్‌రెడ్డి, ఐఈఈఈ జయముఖి స్టూడెంట్ బ్రాంచ్ కౌన్సిలర్, ఈఈఈ బ్రాంచ్ హెచ్‌డీ రజనీకుమార్ గెలుపొందిన విద్యార్థిని సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News