Monday, December 23, 2024

ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలి: జయప్రద

- Advertisement -
- Advertisement -

Jayaprada about NTR on his 100th Birth Day

“నటనకే నటన నేర్పిన మహానటుడు నందమూరి తారక రామారావు ”అని అన్నారు సీనియర్ నటి జయప్రద. “నేను చాలా అదృష్టవంతురాలినని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎన్టీఆర్‌ని మూడు తరాలుగా మూడు స్టేటస్‌లలో చూశాను. నా చిన్నప్పుడు నేను ఆయనకి వీరాభిమానిని. పెద్దయిన తర్వాత.. ఆయన పక్కన నటించడంతో నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. మాది మంచి జంట అనే స్థాయికి మేమిద్దరం కలిసి నటించాం. అలాగే ఆయన పార్టీ పెట్టిన తర్వాత నేను ఆయన నాయకత్వంలో పనిచేశాను. ఈ మూడు స్టేజ్‌లలో ఆయనని నేను చాలా దగ్గరగా చూశాను”అని జయప్రద తెలిపారు.

Jayaprada about NTR on his 100th Birth Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News